మా కొత్త సినిమాని మేము వేలం వేయబోతున్నాము.
Ram Gopal Varma
అవును, నేను, మంచు విష్ణు కలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న
డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి విప్లవాత్మకంగా ఓ కొత్త పద్దతిలో మోహన్ బాబు
కార్పొరేషన్నిర్మించిన యాక్షన్ / క్రైమ్ థ్రిల్లర్ ని వేలం వేయబోతున్నాము. ఈ
సినిమా ట్రైలర్ ని ఈరోజు July 30th న 6 గంటలకి యుట్యూబ్ లో విడుదల
చేయబోతున్నాము.
ఈ సినిమాలో తారాగణం విష్ణు మంచు, తేజస్వి, రేవతి, కోట శ్రీనివాసరావ్,
బ్రహ్మానందం,మధు షాలిని, సుప్రీత్, శ్రావణ్ తదితరులున్నారు. ఇక వేలం
విషయానికొస్తే, ఆనవాయితీగా ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో
నిర్మాత సినిమా ట్రైలర్ ని సీడెడ్, వెస్ట్,ఈస్ట్, నైజాం, మొదలగు
డిస్ట్రిబ్యూషన్ ఏరియాలకి సంబంధించినబయర్స్ కి చూపించి తన రేటు చెప్పుతాడు.
ఆ ట్రైలర్ చూసి వాళ్ళ దృష్టిలో ఆసినిమా ఎలా ఉంటుందోనన్న అవగాహన తోనో, ఆ
సినిమా లోని నటీనటులు, డైరెక్టర్,ప్రొడ్యూసర్ ట్రాక్ రికార్డ్ ల మూలానో, ఆ
సినిమాని చూడబోయే ప్రేక్షకుల అవగాహన మీద అంచనా తోనో ప్రొడ్యూసర్ కి వాళ్ళ
రేటు చెప్పుతారు. ఆ రేటు నచ్చకపోతేప్రొడ్యూసర్ తన తాహత బట్టి ఆ సినిమాని
తనే రిలీజ్ చేసుకుంటాడు.
సినిమా అనేది ఈ రోజుల్లో ఒక కమర్షియల్ ప్రోడక్ట్… అలా అయినప్పుడు దాన్ని
అతి ఎక్కువ మందికి అమ్మాలనే ముఖ్య ఉద్దేశ్యంలో నుంచి పుట్టుకొచ్చినదే నా ఈ
వేలం పద్దతి డిస్ట్రిబ్యూషన్. కాకపోతే ఏ కమర్షియల్ ప్రోడక్ట్ లో నైనా మనం
ఖచ్చితమైన లక్షణాలు చెప్పవచ్చు గానీ సినిమా అనే కమర్షియల్ ప్రోడక్ట్ లోని
లక్షణాలు ఒక మనిషిసున్నితత్వం, బావోద్వేగాల మీద ఆదారపడుతుంది. అంతే కాకుండా
ఆ సున్నితత్వాలు, ఆ బావోద్వేగాలు మనిషి, మనిషికీ మారిపోతూ ఉంటాయి. ప్రతి
వ్యక్తిలోనూ వేర్వేరుగా ఉంటాయి.
నేను తీసిన సినిమాల్లో కొన్ని విజయం సాదించాయి కొన్ని సాదించలేదు.
ఎప్పటికీ కొత్త కథా శైలితో చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించే
నా సినిమా, ఎలా ప్రేక్షకులుకి నచ్చుతుందో ఊహించడం నాకైనా, మరెవరికైనా
అసాద్యం. కానీ రెండుగంటల పాటు సినిమా చూసే ప్రేక్షకుడిని మెప్పించే నిజమైన
ఉద్దేశ్యమే లేకపోతే నేను గానీ లేదా మరే ఇతర డైరెక్టర్ అయినా ఎందుకు ఆరు
నెలలు నుంచి సంవత్సరం వరకూ కష్టపడుతాడు. నా సినిమాల్లో కెల్లా అతి పెద్ద
బడ్జెట్ సినిమా “దౌడ్” లో పెద్ద నటీనటులు సంజయ్ దత్, ఊర్మిళ, “రంగీల”
తరువాత ఎ. ఆర్. రెహమాన్ ఉన్నా సరేఆ సినిమా ఆడలేదు. దాని తర్వాత వెంటనే చాలా
తక్కువ బడ్జెట్ లో అసలు ప్రొడక్షన్ విలువలు లేకుండా చెమట ముఖాలతో కనబడే
నటీనటులతో తీసిన “సత్య” చాలా పెద్ద హిట్ అయ్యింది. నాగురించి పక్కన
పెట్టితే, చాలా సార్లు తక్కువ బడ్జెట్ సినిమాలు“ప్రేమ కదా చిత్రం” లాంటివి
చేసే కలెక్షన్లు కన్న పెద్ద పెద్ద స్టార్లు నటించిన సినిమాలకలెక్షన్లు చాలా
తక్కువ రావడం మనం ఎన్నో సార్లు చూసాం.
దీనిబట్టి నేను మళ్ళీ నిర్దారించేదేంటంటే, ఒక ప్రేక్షకుడికి ఏ సినిమా
ఎందుకు ఎంతనచ్చుతుందో వాటి కారణాలని ఊహించలేమని. ఏ సినిమా అయినా ఏ రేంజ్ లో
సక్సెస్ అవుతుందో మనం ఊహించలేమనే ఆలోచనా వ్యవస్థ నుంచి వచ్చిన నా
వినూత్నఆలోచన ఏమిటంటే, ప్రేక్షకులకి ఏదైతే నచ్చుతుందో నాకు తెలుసు అని
అనుకునే ఆఇద్దరు, ముగ్గురు బయర్స్ సినిమాని విలువ కట్టే కన్నా మా ఈ
“టెన్షన్” సినిమావ్యాపారంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న
ప్రతీ ఒక్క వ్యక్తికి ఈ సినిమావిలువ కట్టి దీని బిజినెస్ లో పాల్గొనటానికి
అవకాశమివ్వాలని.
ఉదాహరణకి పాలకొల్లులో ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో ఎక్కడో భీమవరంలోనో,
ఇంకెక్కడో కూర్చుని ఉన్న వెస్ట్ గోదావరి బయర్ నిర్ణయించడం కంటే
పాలకొల్లులోనేఉండే నివాసి డైరెక్ట్ గా తనే ఆ రేటుని నిర్ణయించవచ్చు.
ఎందుకంటే తను అక్కడలోకల్ గా ఉండే వ్యక్తి కాబట్టి ఆ ఏరియా గురించి, అక్కడి
ప్రేక్షకుల గురించి తనకే బాగా తెలుస్తుంది. అదే నిజం రాజమండ్రి, కరీంనగర్,
ఒంగోలు, అనకాపల్లి, ఇంకా మిగతావందల సెంటర్లకి వర్తిస్తుంది….
మా ఈ సినిమాని గుంటూరు లో ఉన్న ఒకరో, ముగ్గురు, నలుగురు స్టూడెంట్సో
కలిసి డబ్బులు వేసుకొని కొనవచ్చు… లేదా వైజాగ్ లో ఉన్న కిట్టి పార్టీలో
నిర్ణయం తీసుకుని కొంత మంది స్త్రీలు కలిసి కొనుక్కోవచ్చు… లేదా హైదరాబాద్
లో ఐటికంపెనీలో పనిచేసే ఇద్దరు ఫ్రెండ్స్ లేదా విజయవాడలో కొంత మంది ఆటో
డ్రైవర్లు కలిసి కొనుక్కోవచ్చు… ఇలా ఎవరైనా సరే ఎక్కడనుంచైనా సరే ఈ
సినిమాని కొనుక్కోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే ఈ సినిమా బిజినెస్
లోకి రావచ్చు.
ఆగష్టు 1 న ఉదయం 9 గంటలకి మొదలవ్వబోయే filmauction.in వెబ్సైట్ లో ఈ
సినిమాకి సంబందించి అన్ని కమర్షియల్ వివరాలు, ట్రైలర్ తో పాటు ప్రతీ సెంటర్
యొక్క రేటు, అలాగే ప్రొడక్షన్ హౌస్ కి, కొనాలనుకునే వాళ్లకి
మద్యకమ్యూనికేషన్ విదానం పొందపరచడం జరుగుతుంది. వేలం పాట పాడే పద్దతిలోనే
ప్రతీసెంటర్ కి ఒక బేస్ రేట్ ఉంటుంది. ఎక్కువ పాట పాడే వారిని
కనుగొనటానికి, onlineకౌంటర్ లో ప్రకటించిన తేది నుండి 7 రోజుల గడువు
ఇవ్వడం జరుగుతుంది.అనగా ఆగష్టు 1 వ తేది ఉదయం 9 గంటలకి online పాట
మొదలుపెడితే ఆగష్టు 7 వ తేది సాయంత్రం 6 గంటల వరకు వేలం పాట పాడుకునే
అవకాశం ఉంటుంది. ఈగడువులో ఎవరైతే ఎక్కువకి పాడుకుంటారో వారి పేరు ఆ సెంటర్
కి buyer గా ప్రకటించబడుతుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు వెబ్
సైట్ లో లబించబడతాయి.
వేలం గెలిచిన వారికి ఎప్పటికీ వారి సొంతం చెయ్యబడ్డ సెంటర్ లో సినిమా
రిలీజ్ చేసుకునే హక్కు ఉంటుంది. ఉదాహరణకి, ఒక సెంటర్ కి మా పాట 50 రుపాయిలు
అయినప్పుడు, దానిని అందరికన్నా ఎక్కువగా 70 రుపాయిలకి
ఎవరైనాకొన్నారనుకొండి, ఒకవేళ ఆ సినిమా అన్ని ఖర్చులు పోనూ కేవలం 60 లేదా
50రుపాయిలు మాత్రమే కలెక్ట్ చేస్తే ఆ కొనుగోలుదారుడుకి 10 లేదా 20 రుపాయిలు
నష్టంవస్తుంది. కానీ ఒకవేళ 90 లేదా 100 లేదా 120 రుపాయిలు కలెక్ట్ చేస్తే
ఆ మిగిలిన 20లేదా 30 లేదా 50 రుపాయిల లాభం అతనిదే అవుతుంది. సినిమా
నిర్మాతలే సినిమా థియేటర్లు బుక్ చేసి, డిజిటల్ ప్రింట్లు వేయించి, అన్ని
సెంటర్లలో ప్రచారం చేసిసినిమాని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన థియేటర్ల
నుండి వచ్చే డబ్బుని చాలాtransparent పద్దతిలో వాళ్ళ బ్యాంకు అకౌంట్లో
డిపాజిట్ చేస్తారు.
ఇక్కడ గమనించవలసిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇక్కడ బయర్ రిస్క్కన్నా
డైరెక్టర్, ప్రొడ్యూసర్ పెట్టే కాలం, శ్రమ, ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువ
రిస్క్. కాబట్టిమంచి నాణ్యతతో కూడిన సినిమాని నిర్మించటానికి మేము మా
సాయశక్తులా ప్రయత్నం చేస్తాము. మీకు దీనికి సంబందించి మరే ఇతర ప్రశ్నలు
ఉన్నా filmauction.in ఐ.డి.కి మెయిల్ చేస్తే మేము సమాధానమిస్తాము.
మీరు గుర్తించుకోవల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్లేమిటంటే రిలీజ్ డేట్
కానీ, పబ్లిసిటీ చేసే విధానం కానీ, ఏ ధియేటర్లు, ఎన్ని ధియేటర్లలో రిలీజ్
చెయ్యాలన్న నిర్ణయాలు కానీ కేవలం ప్రొడ్యూసర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
దానికి కారణమేమిటంటే రెండు రాష్ట్రాలకి సంబందించి ఒక overall view point
లో సినిమాని పరిరక్షించే బాధ్యత తన మీదుంటుంది కాబట్టి.
Thanking you,
Yours sincerely,
Ram Gopal Varma
Post a Comment